matrudevobhavasevatrust.in Open in urlscan Pro
103.92.235.18  Public Scan

URL: http://matrudevobhavasevatrust.in/
Submission: On May 20 via api from US — Scanned from US

Form analysis 0 forms found in the DOM

Text Content

 * హోం

 * మా ఆశయం

 * ప్రస్థుత లబ్ధి దారులు

 * పూర్వపు లబ్ధి దారులు

 * సంప్రదించండి

కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష దైవంతో సమానం. ఈ ప్రధాన నినాదంతో మాతృదేవోభవ సేవా
ట్రస్ట్ ఆవిర్భవించినది. కన్నతల్లికి, మాతృభూమికి రుణం తీర్చుకునే ప్రక్రియలో
భాగంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్య కొనసాగించలేని ప్రతిభావంతులైన
విద్యార్థినీ విద్యార్థులను గుర్తించి వారిని గమ్యసాధనలో ప్రోత్సహించి సమాజ
ఉద్దరణలో భాగస్వాములను చేయాలనేది సంస్థ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రస్తుత
పరిస్థితులలో ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి, వ్యక్తిత్వ ఔన్నత్యాన్ని
పెంపొందించుకొనడానికి అత్యుత్తమ మార్గం ఉన్నత విద్య. ఉన్నత విద్య ద్వారా ఉత్తమ సమాజ
నిర్మాణం సాధ్యపడుతుంది. తద్వారా విద్యార్థుల వ్యక్తిగత భవిష్యత్తు మాత్రమే కాక దేశ
భవిష్యత్తు కూడా ప్రజ్వలితమవుతుంది. ఈ భావన ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావింపబడేటట్లు
కృషి చేయడం సంస్థ యొక్క ముఖ్య ఆశయం. ప్రతి విద్యార్థిచేత దేశభక్తి, నైతికత,
క్రమశిక్షణ ఆచరింప చేయడం ద్వారా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించి, తమ దేశ
ప్రగతికి తోడ్పడేటట్లు చేయాలనేది ప్రతి సభ్యుని యొక్క వ్యక్తిగత మరియు సామూహిక
సంకల్పం.


మా స్పందన:


మాతృదేవోభవ! పితృదేవోభవ! ఆచార్యదేవోభవ!


సర్వేజనాః సుఖినోభవంతు!

--------------------------------------------------------------------------------

Copyright © Matrudevobhava Seva Trust 20-May-2023